నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమావేశం

22-09-2026 | 08:43pm

తరిగొప్పుల సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల కేంద్రంలో గణేశ నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీసు, గ్రామపంచాయతీ (Gram Panchayat)అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద బారికేడ్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జన ఊరేగింపులో డీజే శబ్దాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీదేవి, ఎమ్మార్వో మోసిన్ ఎంపీడీవో కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు