అథ్లెటిక్స్‌లో అదుర్స్

28-09-2026 | 05:20am

హై జంప్, లాంగ్ జంప్‌లో రజతాలు

నగోయా, సెప్టెంబర్ 27 : ఆసియా క్రీడలలో (Asian Games)భారత అథ్లెట్లు ఆదివారం ఒక్కరోజే ఐదు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో అథ్లెట్ సర్వేశ్ కుషారే 2.25 మీటర్ల ఎత్తుకు జంప్ చేసి రెండో స్థానంతో రజతం సాధించాడు. మహిళల లాంగ్ జంప్‌లో యాన్సీ సోజన్‌కు రజతం దక్కింది. ఐదో జంప్ వరకూ సోజన్ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. కానీ ఆరో జంప్‌లో చైనా అథ్లెట్ హుయాంగ్ యింగ్యింగ్ 6.55 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించింది. 6.53 మీటర్లు దూకిన సోజన్ సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మహిళల 200 మీటర్ల రన్నింగ్ రేసులో హరిత భద్ర మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. 200 మీటర్ల రేసును 23.20 సెకన్లలో పూర్తి చేసింది. కాగా మరో అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. డెకథ్లాన్ పురుషుల ఈవెంట్‌లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ 1500 మీటర్ల రేసులో మూడో స్థానంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ విభాగంలో పారుల్ చౌదరి కాంస్యం సాధించింది.

మరిన్ని వార్తలు