'ఒంటరిగా బీజేపీని అడ్డుకోలేం': ఓవైసీ
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మూడవసారి బీజేపీ(Bharatiya Janata Party) అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని భావించే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(AIMIM chief Asaduddin Owaisi) తెలిపారు. ఆదివారం కాన్పూర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో(Kanpur Cantonment constituency) జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, యూపీ అసెంబ్లీలో తమ (ముస్లిం) వర్గానికి ఒక "గొంతుక" అవసరమని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో AIMIM ఉనికిని బలోపేతం చేయాలని ఓటర్లను కోరారు. "యూపీలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం మాకు కూడా ఇష్టం లేదు. ఒకవేళ మీరు బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలనుకుంటే, వచ్చి MIMతో చేతులు కలపండి," అని ఆయన పిలుపునిచ్చారు.
తాము పొత్తు పెట్టుకుంటామా, ఒకవేళ పెట్టుకుంటే ఎవరితో అన్న విషయాన్ని ప్రకటించేందుకు అక్టోబర్ 2 వరకు వేచి చూస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) సమయంలో తమ పార్టీ చేసిన ప్రతిపాదన గురించి కూడా ఒవైసీ ప్రస్తావించారు. పొత్తులో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేయాలని AIMIM భావించినప్పటికీ, దానికి బదులుగా "అవాస్తవ ఆరోపణలను" ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను(Akhilesh Yadav) లక్ష్యంగా చేసుకున్న ఒవైసీ, 2013 నాటి ముజఫర్‌నగర్ అల్లర్ల(Muzaffarnagar riots) ప్రస్తావనతో అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. సుమారు 50 వేల మంది తమ ఇళ్లు, గ్రామాల నుండి నిర్వాసితులయ్యారని పేర్కొన్న ఓవైసీ, ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) ప్రభుత్వంలో ముస్లింల ప్రాతినిధ్యం గురించి ప్రశ్నించారు.