పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం
19-08-2026 12:00 AM
గద్వాల టౌన్, ఆగస్టు 18: బడుగు, బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడీఓసీలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొని నివాళులర్పించారు. పాపన్న ఆశయాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు.






