ప్యారడైజ్ ఫుల్ జోష్!

11-09-2026 | 05:30am

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడై జ్’(‘The Paradise’) సెప్టెంబర్ 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్ వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23న జరగనున్నాయి. ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడ క్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఈ జోష్‌లో తాజాగా ఈ మూవీ టీమ్ విడుదల చేసిన నాని కొత్త పవర్‌ఫుల్ స్టిల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాని స్ట్రైకింగ్ లుక్‌తోపాటు ఈ ఫొటో వెనుక ఉన్న ఆసక్తికరమైన మేటర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పిక్ శ్రీకాంత్ ఓదెల మొబైల్ ఫోన్‌లోని స్క్రీన్‌షాట్ కావడం విశేషం.

ఇందులో నాని రగ్గడ్ పీరియడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. పొడవాటి జడలు, ఒత్తయిన గడ్డం, రఫ్ అండ్ డార్క్ కాస్ట్యూమ్‌లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో భారీ తుపాకీ పట్టుకుని, ఇంటెన్స్ చూపుతో ముందుకు చూస్తున్నారు. నోట్లో జడలు ఉండటం ఆయన క్యారెక్టర్‌లోని రా అండ్ ఎర్తీ అప్పియరెన్సుకు మరో లేయర్‌ను యాడ్ చేస్తోంది. 

మరిన్ని వార్తలు