ఎంజీఎంలో వరస ఘటనలతో ఆందోళన చెందుతున్న రోగులు
22-09-2026 | 09:39pm
హనుమకొండ, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): ఎంజీఎం లో జరిగిన వరుస ఘటనలతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర తెలంగాణలోనే అత్యంత పెద్దదైన ఎంజీఎం ఆస్పత్రిలో(MGM Hospital) ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులూడిన ఘటన మరువకముందే, ఆస్పత్రిలోని ఆర్ఐసి యు, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డ సంఘటన మంగళ వారం ఉదయం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం నుండి రోగుల బంధువులను ఎంజీఎం లోకి రాకుండా గేట్లు వేసి పోలీసులు కాపలా కాస్తున్నారు.అరకోర వసతులతో రోగులు అవస్థ పడుతున్నారు.