15 June, 2026 | 7:18 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

ఫీనిక్స్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు పీసీబీ నోటీసులు

25-08-2024 12:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజల నివాస ప్రాంతంలో రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్వహిస్తున్న ఫీనిక్స్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు తెలంగాణ కాలుష్య నియంత్రణా మండలి(పీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 285, 286లలో క్యాప్టీవ్ రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌ను ఫీనిక్స్ సంస్థ నిర్వహిస్తోంది. దీంతో సమీపంలోని పలు కాలనీ ప్రజలు వాయు, శబ్ధ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్లాంట్‌ను మూసివేయాలని  2022 సెప్టెంబర్ 19న పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ ఫీనిక్స్ ప్రతినిధులు దీనిని 2024 జూన్ 26న రద్దు చేయించారు. దీంతో ఈ నెల 7, 14 తేదీలలో కాలనీ ప్రజలు మళ్లీ పీసీబీకి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై  అధికారులు ప్లాంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాంట్ కార్యకలాపాలతో కాలుష్యం ఉత్పత్తి అవుతున్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. ప్లాంట్‌ను ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు ఏడు రోజుల్లోనే వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.