14 July, 2026 | 6:34 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి

15-06-2026 07:12 PM

* పలు కుటుంబాలను పరామర్శించిన జాన్సన్ నాయక్

ఉట్నూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను గ్రామస్థాయి నుంచి పెద్ద మొత్తంలో చేయించాలని ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేశారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు.  అనంతరం కేస్లాపూర్, దన్నోరా బి, మండల కేంద్రంలో పలువురు కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం అందించారు. ఆయనతోపాటు  పిఎసిఎస్ చైర్మన్  మారుతి డోంగ్రే, సర్పంచ్ జమున నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు  జిలాని బేగ్  ల తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.