24 June, 2026 | 5:54 PM

పి డి ఎస్ యు నిరసన

24-06-2026 05:04 PM

నిర్మల్ జూన్ 24 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా అధ్యక్షులు వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు పాల్గొన్నారు.