కల్లేపల్లిలో పెన్షన్ లబ్ధిదారుల పరిశీలన

03-10-2026 | 05:56pm

ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాల పరిశీలన

బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామం(Kallepalli Village)లో పెన్షన్ లబ్ధిదారుల(Pension Beneficiary) వివరాల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షన్ అధికారులు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు.

లబ్ధిదారుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించడంతో పాటు, వారు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నారో లేదో, జీవించి ఉన్నారో లేదో అధికారులు నిర్ధారించారు. అర్హులైన వారికి పెన్షన్ కొనసాగించడంతో పాటు, అనర్హులను గుర్తించి తొలగించేందుకు ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిగుల్లా మోహన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనర్హులను తొలగించి, అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు మంజూరు చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో కె. ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఆకుల రాకేష్, రకం రాజు, రవి శంకర్, పెన్షన్ అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు