విషజ్వరాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
మండల వైద్యాధికారి ఎస్.మధుకర్
గుమ్మడిదల, సెప్టెంబర్ 9: వర్షాలు సరిగ్గా పడక రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పుల కారణంగా విష జ్వరాలు కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రతి ఇల్లు చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాల(fever)తో మంచాన పడుతూ పలు ఆసుపత్రిలలో జనాలు కనిపిస్తున్నారు.
దగ్గు, జలుబుతో మొదలై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇన్ఫు్ల ఎంజా (వైరల్ ఫ్లూ) కేసులు రోజు రోజుకు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరల్ జ్వరాల్లో బాధితులు తీవ్రమైన చలి ఒంటినొప్పులు గొంతు నొప్పి విపరీతమైన నీరసం వాంతులు కల్ల వెనుక నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మెడికల్ షాపులకు వెళ్లి ఆంటీబయాటిక్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు వాటితో తగ్గక పోవడంతో ప్లేట్లెట్స్ (రక్త కణాలు) పడిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ప్రభుత్వ వైద్య శిబిరానికి వెళ్లి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండల వైద్యాధికారి మధుకర్(Mandal Medical Officer S. Madhukar) మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాతావరణం లో ప్రజలు వారి ఆరోగ్యం పైన దృష్టి సారించాలని వైరల్ ఫ్లూ లాంటి దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, చలి, వాంతులు, నీరసంగా అనిపిస్తే వైద్యులని సంప్రదించవచ్చని, ఎక్కువగా వేడి చేసిన నీళ్లను తాగాలని, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.