ఫీల్డ్ అసిస్టెంట్‌పై పెంపుడు కుక్క దాడి
సీఎం సభ వెళ్లే క్రమంలో ప్రమాదం
ఆస్పత్రికి తరలింపు
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రెబ్బెన ఫీల్డ్ అసిస్టెంట్ పై పెంపుడు కుక్క దాడి చేసింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లే క్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎటకారి రాజేశ్వర్ ప్రజలను సభకు తీసుకు వెళ్లేందుకు బస్సులలో తరలించేందుకు జన సేకరణ చేస్తున్న క్రమంలో పెంపుడు కుక్క ఒకేసారిగా అతనిపై దాడి చేయడంతో చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఇలా పెంచుకునే కుక్కలే దాడి చేస్తే చర్యలు ఎవరిపై తీసుకోవాలి అని ప్రజలు విమర్శిస్తున్నారు. కుక్క దాడి చేసిన యజమానిపై తగు చర్యలు తీసుకొని కుక్కల బెడద లేకుండా అధికారులు చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.






