29 July, 2026 | 12:39 PM

విపక్షాల ఆందోళనతో రాజ్యసభ వాయిదా

29-07-2026 11:43 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్ష సభ్యులు(Rajya Sabhaనినాదాలతో సభను హోరెత్తించారు. పలు అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. అన్ని అంశాలపై చర్చ చేపడతామని రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్(Rajya Sabha Chairman C.P. Radhakrishnan) సూచించారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ చైర్మన్ సభ మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా పడింది. కాపాడాల్సిన వారే దాడులు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?, విద్యార్థులపై తీవ్రంగా దాడి చేసిన పోలీసుల పట్ల చర్యలేవి? అని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే హయాంలోనే శాంతిభద్రతలకు పెద్దపీట వేసినట్లు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థిగా ఉన్న నన్ను కూడా అరెస్టు చేశారని నడ్డా తెలిపారు.