ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటు తాసిల్దార్ కు వినతి
27-04-2026 03:47 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల తహసిల్దార్ బషీరుద్దీన్ కి గో సమ్మన్ అభియాన్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సోమవారం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, సంపూర్ణ గోహత్య రూపుమాపుటకు చట్టం తీసుకురావాలని, గో సేవా కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల తహసిల్దార్ బషీరుద్దీన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల అధ్యక్షులు బండారి సూర్య, కొమరవెల్లి శ్రీధర్, తుమ్మ రాజ్ కుమార్ ,సాదుల కరుణాకర్, తిరుపతి రెడ్డి, అశోక్, గంగాధర్ పాల్గొనడం జరిగింది.






