మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కొణతం సత్యనారాయణ రెడ్డి ని కలిసిన పిల్లుట్ల రఘు

20-09-2026 | 06:56pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 20(విజయ క్రాంతి):--నేరేడుచర్ల  పట్టణ సీనియర్ నాయకులు,మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కొణతం సత్యనారాయణ రెడ్డి ని(Former Town Party President Konatham Satyanarayana Reddy) హుజుర్నగర్ నియోజకవర్గ బిఆరెస్ నాయకులు పిల్లుట్ల రఘు ఆదివారం నాడు ఆత్మీయకంగా కలిసి యోగక్షేమాలు తెలుసుకొని పార్టీ కోసం మళ్ళీ ఉత్తేజం అయ్యి నియోజకవర్గంలో బిఆరెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలనీ కోరారు. అందుకు వారు సుముకతను వ్యక్తం చేసి ఖచ్చితంగా రాబోవు రోజులలో పార్టీ కోసం పనిచేసి నేరేడుచర్ల పార్టీ అభివృద్ధి కోసం పాటు పడుతానని తెలిపినట్టు వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో బిఆరెస్ పార్టీ సీనియర్ ఉద్యమ నాయకులు మాజీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు న్యాయవాది నగేష్ రాథోడ్, మాజీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా శ్రీను నాయక్, మొదటి వార్డ్ కౌన్సిలర్ గుగులోత్ రవి నాయక్,జంపాల వెంకన్న, శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు