29 August, 2026 | 12:22 PM

బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం

29-08-2026 11:42 AM

 బోథ్. ఆగస్టు 30( విజయ క్రాంతి) మండల కేంద్రంలోని వేదం పాఠశాలలు శనివారం చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ సతీష్ విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 1098 నెంబర్ కు కాల్ చేయాలని పించారు. అంతేగాక పిల్లలకు ఉన్న హక్కుల గురించి వివరించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం 24 గంటలు ఫోన్ కాల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. విద్యాపరంగా ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఫోన్ కాల్ ద్వారా వివరించాలని కోరారు.

ఎంఈఓ విచారణ

పాఠశాలలో విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టిన విషయమై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ అహ్మద్ హుస్సేన్సరైన సంఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలు విషయంలో తీసుకున్న చర్యల గురించి తక్షణమే నివేదిక ఇవ్వాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ ను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండవద్దని పేర్కొన్నారు.