10 April, 2026 | 3:18 AM

మరో 60 రోజులు సమయమివ్వండి

10-04-2026 01:17 AM
  1. ఆ లోపు 8.45 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తాం
  2. తెలంగాణలో వరి ఉత్పత్తి భారీగా పెరిగింది 
  3. ఈసారి బాయిల్డ్ రైసును 20 లక్షల టన్నులు కొనాలి
  4. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ 

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రం వద్ద ప్రస్తుతం 8.45 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయని, ఈ బియ్యం ఫిబ్రవరి 28, 2026 వరకే కేంద్రానికి సరఫరా చేయాల్సి ఉండేదని, ఇప్పటికే గడువు ముగిసినందున.. మరో 60 రోజుల వరకు గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణలో వరిపంట ఉత్పత్తి ఎక్కువగా ఉందని, కేంద్రం మాత్రం రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేసే లక్ష్యాన్ని తగ్గించడం వల్ల అనేక సమస్య లు ఉత్పన్నమవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. అంతు కుముందు రాష్ట్రంలోని బియ్యం నిల్వలపై సివిల్ సప్లయ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎఫ్‌సీఐ రారైస్ బియ్యం ఎక్కువగా కొనుగోలు కంటే బాయిల్డ్ రైసు కొనుగోలును పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024- రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రం వద్ద 5 లక్షల టన్నుల బాయిల్డ్ రైసు ఉందన్నారు.

తెలంగాణ ప్యాడీ గింజల నాణ్యత మెరు గ్గా ఉండడం, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల ఉడకబెట్టిన బియ్యం తయారీకి అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు కేవలం 5 శాతం బ్రోకెన్ రైసుతో సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. 2025 మార్కెటింగ్ సీజన్‌లో మొత్తం(ఖరీఫ్, రబీ) కోసం ఉడకబెట్టిన బియ్యం లక్ష్యాన్ని 20లక్షల టన్నుల వరకు పెంచాలని, ఇది రాష్ట్ర ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ఉండేందుకు అవసరమని చెప్పా రు.

ఖరీఫ్ ప్యాడీ నిల్వల ధ్రువీకరణ ఇంకా పూర్తి కాలేదని, ప్రాసెసింగ్‌కు అదనపు సమయం వసరమని వివరించారు. డిసెంబర్ 2023లో అధికా రంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్యాడీ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ తరఫున డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ కింద వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకే కనీస మద్దతు ధరనే చెల్లిస్తున్నట్లు చెప్పారు.

అయి తే, కస్టమ్ మిల్ రైస్ (సీఎంఆర్), ఉడకబెట్టిన బియ్యం లక్ష్యాలను కేంద్రం తగ్గించడం వల్ల, తెలంగాణకు అధిక నిల్వలు, నిల్వ ఖర్చులు, మిల్లింగ్ వ్యయాలు, వడ్డీ భారం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

తెలం గాణలో ప్యాడీ ఉత్పత్తి విపరీతంగా పెరిగిందని, లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతర కొనుగోలు అవసరమని మంత్రి స్పష్టం చేశారు. అయితే, కేంద్రం తగిన మద్దతు ఇవ్వకుండా రాష్ట్రం ఈ ఆర్థిక భారాన్ని ఎక్కువకాలం భరించడం సాధ్యం కాదని, ఈ అంశాలను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.