మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు
06-10-2026 | 03:12pm
బాన్సువాడ, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలువురు ఆత్మీయులను, బాధిత కుటుంబ సభ్యులను మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy)పరామర్శించి తన ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు.
బాన్సువాడ పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా తండ్రి పాషా బాయి అనారోగ్యంతో మరణించడంతో వారి ఇంటికి వెళ్లి గౌస్ పాషా, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.