ఇంద్ల తండాలో పోలీసుల కార్డెన్‌ అండ్‌ సెర్చ్

03-10-2026 | 05:17pm

30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోల తనిఖీ

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కొమరారం పోలీస్‌ స్టేషన్‌(Komararam Police Station) పరిధిలోని ఇంద్ల తండాలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌(Police Cordon and Search Operation) నిర్వహించారు. ఇల్లందు డీఎస్పీ యు.వెంకన్న బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సబ్‌ డివిజన్‌ పోలీసులు, టీజీఎస్పీకి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని 100 మంది ప్రజల సమక్షంలో ఇళ్ల పరిసరాలు, రహదారులు, వాహనాలను(Surroundings of houses, roads, vehicles) తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 30 ద్విచక్ర వాహనాలు(Two-wheelers), మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు ఉన్న వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించారు. అనంతరం గ్రామస్తులకు డ్రగ్స్‌, గంజాయి, గుడుంబాకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

తెలియని లింకులను క్లిక్‌ చేయవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. గ్రామంలోకి అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. అక్రమ కార్యకలాపాలపై నమ్మదగిన సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు తగిన రివార్డు అందజేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు