జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన
07-08-2026 03:46 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 880 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 910కు పెరగనున్నాయి. అలాగే 5 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పు, 2 కేంద్రాల పేర్ల సవరణ, 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న 3 కేంద్రాల విభజనకు కూడా ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించిన అనంతరం తుది ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.






