17 April, 2026 | 9:38 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

పీఆర్సి వెంటనే అమలు చేయాలి

17-04-2026 08:33 PM

పెండింగ్ డిఏ బిల్లులను చెల్లించాలి

నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన

టీపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్

గాంధారి,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ టీఏలు చెల్లించాలని టీజీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గాంధారి ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని టీజీజేఏసీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధారి ఉన్నత పాఠశాల లో  పీఆర్సీ వెంటనే అమలు, పెండింగ్ డీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.