మండల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం
కన్నాయిగూడెం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి) : కన్నాయిగూడెం మండల(Kannayigudem Mandal) ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించాలని ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం(Eturunagaram Divisional Engineer Purushotham) సిబ్బందిని ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మండలంలో అనధికారిక విద్యుత్ కోతలు(Power cuts) అనే కథనాన్ని విజయక్రాంతి దినపత్రికలో మంగళవారం రోజున ప్రచురించారు. కథనంపై బుధవారం రోజున స్పందించిన సీఎండీ మరియు ములుగు సూపరిండెంట్ ఇంజనీర్ బిక్షపతి(Mulugu Superintending Engineer Bikshapathi) ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు, కన్నాయిగూడెం సబ్ స్టేషన్లను ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం బుధవారం రోజున తనిఖీ చేసారు.
అనంతరం అయన మాట్లాడుతూ ఎల్ నినో(El Nino) ప్రభావంతో టీజీఎన్పీడీసీఎల్ మీద అధిక భారం పడుతుందని,సిబ్బంది త్రీ ఫేస్ కరెంటు ఉన్న సమయాల్లో అత్యవసర పరిస్థితిలో తప్ప ఎల్సీ (లైన్ కట్ ) చేయకూడదని ఆదేశించారు.కన్నాయిగూడెం, ఏటూరు సబ్ స్టేషన్లల్లో ఎంత వరకు లోడ్ పడుతుందో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, కరెంటు కటింగ్ అటెండన్స్ బుక్ ను పరిశీలించారు.
కన్నాయిగూడెం, ఏటూరు సబ్ స్టేషన్ల(Eturu Substations) పరిధిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి రైతులకు అందుతున్న విద్యుత్ గురించి ఆరా తీశారు.రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు....ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్ దాస్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య,లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, లైన్ మెన్ రవి,అసిస్టెంట్ లైన్ మెన్లు నర్సింహులు, నవీన్, కుమార్ మరియు కరెంటు ఆపరేటర్ సిబ్బంది పాల్గొన్నారు.