21 August, 2026 | 1:40 AM

రెండు రోజులూ వర్షాలే..

21-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురువనున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.