నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం
- ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ
- కలెక్టర్ల సమక్షంలో అర్హుల ఎంపిక
- బీసీ, ఈబీసీ విద్యార్థుల ఖాతాల్లో రూ. 450 కోట్ల స్కాలర్షిప్లు జమ
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అ మలుకు(Implementation of BC welfare schemes) ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇ స్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షే మ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యం తో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు భట్టి వెల్లడించారు.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శ కంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖపై సోమవా రం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బాలామాయదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్ డబ్బులు విడుదల
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను నేరుగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ, ఈబీసీకి చెం దిన 1.30 లక్షల మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమచే యాలని అధికారులను
కాటమయ్య కిట్ల కోసం రూ. 60కోట్లు
గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మం జూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అం దించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు
మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతల రూపంలో 180 మంది విద్యార్థులకు 18 కోట్ల 40 లక్షల నిధులను విడుదల చేశామని వివరించారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.