రామాయణ జోష్
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations)సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో (Ramayana)రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న రావణుడి అవతార్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు.
ఈ పోస్టర్‌లో యశ్ తన పవర్‌ఫుల్ లుక్‌తో ఫ్రేమ్‌ను డామినేట్ చేస్తున్నారు. దీనితోపాటు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేను పరిచయం చేస్తూ మరో కొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వనవాస కాలంలో అడవిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి సాగిస్తున్న ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. పాత్రల లుక్, విజువల్స్‌లోని గ్రాండియర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా భారత్‌లో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఇదే ఏడాది దీపావళికి, 2027 దీపావళికి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.