మార్చురీనా.. ఎలుకల అడ్డానా..?

20-09-2026 | 05:28pm

మార్చురీలో దారుణం.. మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

వరంగల్‌ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ(Mortuary)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయపర్తిలో శనివారం రాత్రి వాహనం ఢీకొనడంతో గారే వీరయ్య మృతి చెందారు. పోస్టుమార్టం(Post mortem) నిమిత్తం మృతదేహాన్ని వర్థన్నపేట మార్చురీకి తరలించారు.

అయితే పోస్టుమార్టం కోసం ఉంచిన మృతదేహం కంటిని ఎలుకలు కొరికినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. మార్చురీలో కనీస వసతులు లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాల సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని వార్తలు