డయాలసిస్ బాధితుల ఇబ్బందులకు త్వరలో..

22-09-2026 | 10:30pm

బేల సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బేల మండలంలోని డయాలసిస్ బాధితుల ఇబ్బందులకు త్వరలో పరిష్కారం లభించనుంది. డయాలసిస్ సెంటర్‌కు రూ.1.50 కోట్ల విలువైన వైద్య సౌకర్యాలు, బెడ్లు మంజూరైనట్లు సమాచారం. రిమ్స్‌ పరిశీలనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha)ను నిధులు విడుదల చేయాలని యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి కోరారు. స్పందించిన మంత్రి రెండు నెలల్లో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రూపేష్ రెడ్డి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు