ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు బస్సులు ఆపాలి
05-08-2026 09:14 PM
పీడిఎస్యు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మికి వినతి పత్రం
కొత్తగూడెం,(విజయ క్రాంతి): కొత్తగూడెం శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో విద్య అభ్యసించుటకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిత్యం సుమారు 50 నుండి 100 మంది విద్యార్థి, విద్యార్థినీలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణలో చివరన ఉన్నా కళాశాల ముందు బస్ స్టాప్ ఉన్నప్పటికీ, బస్సు పాల కేంద్రం వద్ద ఆపుతున్నారు. విద్యార్థి, విద్యార్థినిలు కొంత దూరం నడవాల్సిన పరిస్థితి ఏర్పడినది. దీనివలన విలువైన సమయం వృధా అవుతుందని,కావున బస్సును కళాశాలమందు ఆపాలని కళాశాల విద్యార్థులుగా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా కార్యవర్గంగా డిమాండ్ చేస్తున్నారు.






