calender_icon.png 31 August, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుదీర్ఘ కాలం సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అవ్వడం అభినందనీయం

30-08-2025 07:54:23 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పోలీసు వ్యవస్థకు సేవలందించి పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులకు శనివారం వీడ్కోలు పలికారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్సై ఎండీ. యూసుఫ్, ఏఆర్ఎస్ఐ కె. చంద్రశేఖర్  లను కుటుంబ సమేతంగా ఎస్పీ రాజేష్ చంద్ర సత్కరించారు.

ఎస్పీ మాట్లాడుతూ... కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్నో త్యాగాలతో ప్రజలకు సేవలు అందించడం గొప్ప గర్వకారణమని అన్నారు. పోలీసు శాఖలో వారు అందించిన సేవలు మరువలేనివని, వీరి అనుభవం, సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి జిల్లా ప్రశాంత వాతావరణంలో నిలదొక్కుకునేలా సంఘవిద్రవ శక్తులతో పోరాటంలో వీరి పాత్ర విశేషమని అభినందించారు.