5 September, 2026 | 5:46 AM

దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్

05-09-2026 | 04:55am

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

దేవరుప్పులలో బీఆర్‌ఎస్ వంటావార్పు

దేవరుప్పుల, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): దొంగ హామీలతో(False promises) అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక బ్రోకర్(broker) అని, మాటల గారడీతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వైఫల్యాలను నిరసిస్తూ కేటీఆర్(KTR) పిలుపు మేరకు దేవరుప్పుల ప్రధాన చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా,’వంటా-వార్పు’లో ఆయన తన సతీమణి ఉషాతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు.మహిళలకు నెలకు రూ. 2500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రైతుబంధు, కేసీఆర్ కిట్, పెన్షన్లను ఎగ్గొట్టారని విమర్శించారు.

సాగునీరు ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.అధికారం ఉన్నా లేకున్నా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి,బబ్బురి శ్రీకాంత్ గౌడ్,పల్లా భార్గవి, బస్వ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు