రష్యాలో ‘ప్లేగ్’ అలర్ట్!..200 మందికి క్వారంటైన్!

05-10-2026 | 07:07am

రష్యాలోని సైబీరియాలో ప్లేగ్ వ్యాప్తి (outbreak)పై ఆందోళన నెలకొంది. ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 28 ఏళ్ల టెక్నీషియన్ దార్య షిపిలోవా.. ప్లేగ్ బాక్టీరియా నమూనాలు ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను పగలగొట్టినట్లు సమాచారం. ఆమె మృతి తర్వాత పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్ (quarantine) విధించినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 200 మందిని అబ్జర్వేషన్‌లో (observation) ఉంచినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అయితే ఈ వ్యవహారంపై రష్యా అధికారులు మరో ప్రకటన చేశారు. దార్య షిపిలోవా ప్లేగ్‌తో కాకుండా న్యూమోనియా కారణంగానే మృతి చెందినట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో అసలు ప్లేగ్ వ్యాప్తి (spread)పై వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందన్న దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


మరిన్ని వార్తలు