క్రికెట్ టోర్నమెంట్‌లో మెరిసిన సహారా యూత్

04-10-2026 | 06:51pm

* పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లు..

* ఉత్సాహంగా తలపడిన 8 జట్లు

పాపన్నపేట,అక్టోబర్4: బంతి గాల్లోకి ఎగిరింది.. బ్యాట్‌ బౌండరీ దాటింది.. ప్రతి వికెట్‌తో ఉత్కంఠ పెరిగింది! గెలుపే లక్ష్యంగా ఆటగాళ్లు చివరి బంతి వరకు పోరాడటంతో క్రికెట్‌ టోర్నమెంట్‌(Cricket tournament) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో సహారా యూత్‌ జట్టు(Sahara Youth Team) తనదైన ఆటతీరుతో మెరిసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణిస్తూ క్రీడాభిమానులను ఆకట్టుకుంది.

గ్రామీణ యువతలో(Rural youth) క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో మండల కేంద్రం పాపన్నపేటలోని ఉన్నత పాఠశాల మైధానంలో పాపన్నపేటలో దసరాకు దుర్గమ్మను ప్రతిష్టించే యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్లు హోరాహోరీగా తలపడగా, ఆటగాళ్ల ప్రతిభతో మైదానం ఉత్సాహభరితంగా మారింది. సహారా యూత్‌ ఆటగాళ్లు విజయం కోసం చివరి వరకు పోరాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఫలితం కంటే క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, స్నేహభావంతో పోటీ పడటమే ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత క్రీడల్లో మరింతగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు