నాడు సీజ్.. నేడు పూర్తి?

28-09-2026 | 05:25am
  1. విశ్వరూపం చూపుతున్న అక్రమార్కులు
  2. సీజ్ చేసినా భవనం పూర్తి
  3. నిద్రమత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు
  4. సామాన్యులకు ఒకలా.. పెద్దలకు ఒకలా చట్టం

మల్కాజిగిరి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మల్కాజిగిరి, మౌలాలి సర్కిళ్ల పరి ధిలోని వివిధ కాలనీలలో అక్రమ నిర్మాణా లు(Illegal constructions) ఊపందుకున్నాయి. గతంలో అధికారులే అక్రమ నిర్మాణంగా గుర్తించి సీజ్ చేసిన భ వనంలో తిరిగి పనులు ఎలా మొదలయ్యా యనీ స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత సంబంధిత యజమాని కొత్తగా అ నుమతులుపొందారా? సీజన్ ను అధికారికంగా తొలగించారా.?నిర్మాణానికి జీహెఎం సీ నుంచి అనుమతి లభించిందా.? లేక ఎ లాంటి అనుమతులు లేకుండానేపనులు కొ నసాగించారా? అని స్ధానికులు ప్రశ్నిస్తున్నా రు.

గతంలో జీహెఎంసీగా కొనసాగింది. ఇ ప్పుడు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా మారింది. అదే  అదునుగా అ క్రమ నిర్మాణాలు సీజ్ తొలగించి, తమకు అనుకూలంగా, బహుళ అంతస్ధుల నిర్మా ణం  పూర్తి చేసుకునట్లు స్ధానికంగాఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. 

ఎలాంటి అనుమతులులేకుండానే పనులు కొనసాగినా మ ల్కాజిగిరి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనిస్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి సీజ్ చే సిననిర్మాణంలో తిరిగి పనులు ప్రారంభమై న విషయంఅధికారులకు తెలియకుండా ఉంటుందా అని పలువురు వారి పని తీరు పై  అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. 

లక్షల్లో చేతులు మారాయా?

సీజ్ చేసిన భవన నిర్మాణాలు, నిబంధనలను అతిక్రమించి బహుళ అంతస్థుల  నిర్మాణం వెనుక అధికారులకు  లక్షల్లో ముడుపులు చేతులు మారాయని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సీజ్ చేయబడిన ఈ నిర్మాణాలు, ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని సున్నం కూడా కొట్టడంతో రేపో మాపో గృహ ప్రవేశం చేసి ఎంచక్కా అమ్ముకోవడానికి రియల్ ఏస్టేట్ వ్యాపారులు, యజమానులు సిద్ధంకావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ముడుపులకు సంబంధించిన విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితేనేవాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు. 

అధికారుల అండతోనే?

టౌన్ ప్లానింగ్ అధికారుల అండతోనే సీజ్ చేయబడిన అక్రమ నిర్మాణాలు సక్రమంగా మారాయని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చిన్నపాటి నిర్మాణం చేపడితేనే  క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తుంటారని, అలాంటిది సీజ్ చేయబడిన భవ నాలు  తిరిగి నిర్మాణం పూర్తి చేసుకున్నా అధికారుల దృష్టికి ఎందుకు రాలేదని చైన్ మెన్ లు,అధికారులు, బిల్డర్ కుమ్మక్కై లక్షల కు లక్షలకు చేతులు మారడంతోనే ఈ నిర్మాణాలు పూర్తి అవ్వడం సాధ్యపడిందని స్థాని కులు ఆరోపిస్తున్నారు.

గతంలో సీజ్ చేసిన నిర్మాణాలను, ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉం టుందని, అయినప్పటికీ నిర్మాణం పూర్త య్యే వరకు ఇన్నాళ్లు నిద్ర మత్తులో ఎలా జోగారని స్ధానికులు మండిపడుతున్నారు.అక్రమ నిర్మాణాలపై స్ధానికులు పలు మార్లు ప్రజావాణిలో సైతం అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడు హడావుడిగా నోటీసులు జారీ చేయడం, తప్పనిసరి పరిస్థితిల్లో తనిఖీ చేయడం, కొన్ని సందర్భాల్లో సీజ్ చేయడం, ఆ తదుపరి అమ్యామ్యాలు మాట్లాడుకుని అంలినంత దండుకుని సీజ్ చేసిన నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు అటు వంక అధికారులు కన్నెత్తి చూడక పోవడం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పరిపాటిగా మారింది.

అధికారులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. సీజ్ చేసిన నిర్మాణాలు,ఆ తర్వాత చక చకా పూర్తి అవుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో...ఆ లోగుట్టు దేవుడికే ఎరుక అని స్ధానికులు విమర్శిస్తున్నారు. గతంలో సీజ్ చేస్తే ఏ ప్రాతిపదికన తొలగించారు ? సీజ్ తొలగింపునకు ఎవరు అనుమతిచ్చారు. ? అనుమతులు లేకుంటే నిర్మాణం పూర్తయ్యే వరకు బాధ్యులైన అధికారులు ఏం చేస్తున్నారు...? వీటిపై సంబంధిత ఉన్నతాధికా రులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

స్థానికుల ఫిర్యాదులపై విచారణ చేపడతాం.సిజ్ చేసిన భవనాలను పున ప్రారంభించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం ఐతే కేసులు నమోదు చేస్తాం.  

బాల శ్రీనివాస్, మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ అధికారి

మరిన్ని వార్తలు