నగర శివారులో వరుస చోరీలు
భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు
ఇంటిముందు పార్కింగ్ చేసిన డీసీఎం లో నుంచి 300 లీటర్ల డీజిల్ చోరీ
బుధవారం రాత్రి నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి
పుస్తెలతాడు అపహరణ
అబ్దుల్లాపూర్‌మెట్, మే 21: నగర శివారు ప్రాంతంలో వరుస చోరీలతో స్థానిక భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ఐదు రోజుల నుంచి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంటి ముందు పార్కు చేసి ఉన్న డీసీఎం డీజిల్ ట్యాంకు ను ధ్వంసం చేసి 300 లీటర్ల డీజిల్ ను అపహరించినట్లు స్థానికులు తెలిపారు.
మళ్ళీ రెండు తర్వాత ఇంటి కాంపౌండ్ పార్కు చేసిన కార్ డోర్లను ధ్వంసం చేసినట్లు ప్రజలు తెలుపుతున్నారు. అలాగే బుధవారం అర్ధరాత్రి వేసవికాలం కావడంతో ఇంటి డోర్లు తెరిచి నిద్రిస్తున్న సమయంలో ఓ మహిళ మెడలో నుంచి 4 తూలాల బంగారం పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. స్థానిక ప్రజలు సీసీ కెమెరాలు పరిశీలించగా కారులో దొంగలు సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించామని తెలిపారు.
నిన్న డీజిల్.. నేడు పుస్తెలతాడు అపహరణ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. అబ్దుల్లాపూర్ గ్రామంలో ఓ డీసీఎం రాత్రి సమయంలో పార్కు చెయ్యగా.. డీజిల్ ట్యాంక్ ను ధ్వంసం చేసి 300 లీటర్ల డీజిల్ చోరీ జరిగినట్లు వెల్లడించారు. అలాగే బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను బెదిరించి మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు.
అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన బొడిగె దర్శన్ భారతమ్మ దంపతులు వేసవికాలం కావడంతో తలుపులను దగ్గరగా వేసి గడియ పెట్టకుండా బుధ వారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు తీస్తుండగా వెంటనే గమనించిన ఆమె ప్రతిఘటించింది.
దుండగుడు బలంగా ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడు. దర్శన్ వెంటనే తన కుమారు లకు ఫోన్ సమాచారమిచ్చాడు. ఆయన కుమారులు వెంటనే బాధితులు డయల్ 100 కు కాల్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. దుండ గుడు గొలుసు లాగే క్రమంలో మహిళ మెడపై స్వల్ప గాయాలు అయ్యాయి. దొంగలను పట్టుకుని తన గొలుసు తిరిగి తనకు అప్పగించాలని బాధితురాలు భారతమ్మ పోలీసులను వేడుకుంది.






