ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలు
కొడిమ్యాల, సెప్టెంబర్ 20 (విజయకాంత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల(Zilla Parishad Girls' High School) క్రీడా మైదానం లో ఆదివారం అండర్ 14,17 బాలబాలికలకు వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్, ఎస్ జి ఎఫ్ మండల కన్వీనర్ బూట్ల రాజమల్లయ్యలు తెలిపారు.
వారు మాట్లాడుతూ... వాలీబాల్,అథ్లెటిక్స్ సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వాలీబాల్ బాలికల విభాగంలో ప్రథమ టిజిఎమ్ ఎస్ కొడిమ్యాల, జడ్పీహెచ్ఎస్ నమిలికొండ ద్వితీయ, జడ్పీహెచ్ఎస్ నమిలికొండ ప్రథమ, జడ్పీహెచ్ఎస్ పూడూరు ద్వితీయ సాధించారు. బాలుర అండర్ 14 విభాగంలో టిజిఎమ్ ఎస్ కొడిమ్యాల ప్రథమ, జడ్పీహెచ్ఎస్ నమిలికొండ ద్వితీయ స్ధానం సాధించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ జి ఎఫ్ మాజీ కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్, పీఆర్టీయూ టిఎస్ మండల నాయకులు రాజయ్య,అంజయ్య, టిపస్ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య,శివకృష్ణ,అనూప్ రెడ్డి, గంగాజల, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.