పిడుగుపాటుతో 12 గొర్రెలు మృతి
20-09-2026 | 06:10pm
కోరుట్ల, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): మెట్ పల్లి మండలం రామారావు పల్లె గ్రామ శివారులో (Rama Rao Village)ఆదివారం పిడుగు పాటుతో చిలివేరి మహేందర్ కు చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. గ్రామ శివారు కు గొర్లను మేతకు తీసుకొని వెళ్ళాగా మధ్యాహ్నం ఒక్కసారిగా వచ్చిన ఉరుములు మెరుపులతో వర్షం వర్షం వచ్చి పిడుగు పడటంతో గొర్రెలు మృతి చెందాయి.12 గొర్ల మృతితో తనకు దాదాపు 2 లక్షల నష్టం వాటిలిందని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.