బుల్లెట్ రైలు మార్గం సాధన కోసం రెండో రోజు కొనసాగిన సంతకాల సేకరణ
డాక్టర్లు, వ్యాపారులు, వివిధ సామాజిక సంఘాలు, కార్మికుల మద్దతు
కోదాడ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బుల్లెట్ రైలు, రైలు కారిడార్ సాధన సమితి ఆధ్వర్యంలో బుల్లెట్ రైలు మార్గాన్ని కోదాడ మీదుగా ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన సంతకాల సేకరణ మంగళవారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ దశరధ(Government Hospital Superintendent Dr. Dasharath) పాల్గొని తమ మద్దతును తెలియజేసి సంతకాలు చేశారు.
అదేవిధంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్స్, మైనారిటీ సంఘం ప్రతినిధులు, శాలివాహన సంఘం ప్రతినిధులు, ఎమ్మార్పీస్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని బుల్లెట్ రైలు మార్గం కోదాడ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తమ మద్దతును తెలిపారు.
ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో కన్వీనర్ కనగాల నారాయణ, పాలూరి సత్యనారాయణ, అంబటికర్ర శ్రీను, దేవరశెట్టి సత్యనారాయణ, నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, రాయపూడి వెంకట నారాయణ, ఓరుగంటి వెంకటేశ్వర్లు, చింత బాబు మాదిగ, పసుపులేటి రామారావు, జల్లా జనార్ధన్, మజాహార్, నాగేంద్ర చారి, మాలోతు సైదా నాయక్, సలిగంటి రామారావు, నాగరాజు, చింతకుంట్ల సతీష్, గంగిరెడ్డి రాకేష్ రెడ్డి , సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.