ఇల్లందు ఏరియాలో లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో(Singareni Yellandu Area) WPS&GA స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో భాగంగా రీజినల్ స్థాయి లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీలు(Basketball competitions) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులు క్రీడల్లో(Employees sports) ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడాస్ఫూర్తితో పోటీలు నిర్వహించాలని సూచించారు.
క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఉద్యోగులు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. విజేతలను అభినందించిన జీఎం, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో సాధన చేసి భవిష్యత్ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్, WPS&GA కోఆర్డినేటర్ కిషోర్, జనరల్ కెప్టెన్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.