4 September, 2026 | 12:29 PM

కెపిఆర్ఐటి లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 ప్రారంభం

04-09-2026 | 11:38am

ఘట్ కేసర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Kommuri Pratap Reddy Institute of Technology)లో స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్–2026ను  ప్రారంభించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026లో భాగంగా ఈ ఇంటర్నల్ హ్యాకథాన్‌ను కేపిఆర్ఐటిలో నిర్వహిస్తున్నారు. ఇన్నోవేట్ ఇన్ స్పైర్ అండ్ ఇంపాక్ట్ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ 24 గంటల హ్యాకథాన్ కేపిఆర్ఐటి బ్లాక్–బి  ఆడిటోరియంలో ప్రారంభమైంది.

విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈప్రారంభ కార్యక్రమంలో డైరెక్టర్–స్ట్రాటజీ కొమ్మూరి దివ్య శ్రీ, సీఈవో డాక్టర్ సి.డి. నాయుడు, డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.  శ్రీనాథ్ కశ్యప్, వైస్ ప్రిన్సిపాల్ వై. విశ్వశ్రీ, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, డీన్ డాక్టర్ రాజేష్ బనాల తదితరులు పాల్గొన్నారు.