4 September, 2026 | 12:28 PM

చర్లలో కాంగ్రెస్ భారీ శక్తి ప్రదర్శన

04-09-2026 | 11:30am

 హోరెత్తిన కాంగ్రెస్ శ్రేణుల హోరు

భారీ బైక్ ర్యాలీతో దద్దరిల్లిన మండల కేంద్రం

చర్ల - విజయక్రాంతి: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చర్ల మండల కేంద్రం గురువారం కాంగ్రెస్(Congress) మయమైంది. మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ(Bike rally) హోరెత్తించింది.భద్రాచలం శాసనసభ్యులు  తెల్లం వెంకట్రావు(Tellam Venkatrao) ఈ బైక్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన జోష్ నింపారు. వందలాది బైకులతో యువత చేసిన విన్యాసాలు, నినాదాలతో చర్ల పట్టణం మార్మోగిపోయింది.

ప్రజా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నల్లపు దుర్గాప్రసాద్ , జిల్లా ఉపాధ్యక్షులు  చీమలమర్రి మురళి  ఆధ్వర్యంలో, చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు  నేతృత్వంలో ఈ ర్యాలీ)rally) ) నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలిన లంక రాజు, బ్రహ్మానంద రెడ్డి, ర్యాలీని ముందుండి నడిపించారు.

ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, బూత్ స్థాయి నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.