4 September, 2026 | 12:30 PM

బీఆర్ఎస్ వంటా వార్పు

04-09-2026 | 11:42am

మహబూబాబాద్, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రం పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు(వంటా వార్పు(VANTAA VAARPU) కార్యక్రమం చేపట్టారు. గురువారం ఎస్సారెస్పీ(SRSP) కాలువలో నిరసన చేపట్టగా, శుక్రవారం వంటా వార్పు కార్యక్రమం చేపట్టి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా , ప్రజల సమస్యల పరిష్కారానికి కోసం ఉద్యమిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Banoth Shankar Naik) తెలిపారు.