ఇన్సర్వీస్ టీచర్లకు గుడ్న్యూస్
హైదరాబాద్: ఇన్సర్వీస్ టీచర్లకు సంబంధించి స్పెషల్ టెట్-2(Special TET-2) నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో స్పెషల్ టెట్-2 కోసం ఎదురుచూస్తున్న ఇన్సర్వీస్ టీచర్లకు కీలక అప్డేట్ అందింది.
అక్టోబర్ 7 నుంచి 16 వరకు స్పెషల్ టెట్-2 ఆన్లైన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్ 16 నుంచి 21 వరకు స్పెషల్ టెట్-2 పరీక్ష(Special TET-2 Exam 2026) నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు అధికారికంగా పరిశీలించి, గడువు ముగిసేలోపు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు పేర్కొన్నారు.