నిర్మల్‌లో చెన్నై షాపింగ్ మాల్
ప్రారంభించిన నటి శ్రీలీల
తరలివచ్చిన అభిమానులు
నిర్మల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం సినీ తార శ్రీలీల(Actress Sreeleela) సందడి చేశారు. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్(Chennai Shopping Mall) నూతన షోరూంను ఆమె ప్రారంభించారు. శ్రీలీల మాట్లాడుతూ.. చెన్నై షాపింగ్ మాల్ షోరూంను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. ఇప్పటివరకు 35 షోరూంల ను ప్రారంభించినట్లు తెలిపారు.
నిర్మల్ పట్టణానికి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని నిర్మల్ ప్రజలు నూతన షోరూంలో షాపింగ్ చేయాలని కోరారు. శ్రీలీలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అభిమానులకు అభివా దం తెలుపుతూ శ్రీలీల నృత్యం చేసి సం దడి చేశారు. మొదటిరోజు షాపింగ్ చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తల్లి రావడంతో సందడి నెలకొంది.