భక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది
500 ఏండ్ల క్రితమే కొలువుతీరిన శ్రీ తిరుమలనాథ స్వామి
శ్రావణమాసంలో శ్రీ తిరుమలనాథ స్వామి ఉత్సావాలు
ఎద్దుల బండ్లతో స్వామి వారి ఊరేగింపు
మహమ్మదాబాద్: మండల పరిధిలోని జూలపల్లి గ్రామ పరిధిలో గడిచిన 500 ఏండ్ల క్రితం కొలువుతీరిన శ్రీ తిరుమలనాథ స్వామి(Sri Tirumalanatha Swamy) ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రతి ఏడాది శ్రావణమాసంలో చివరలో జరగనున్న ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఎద్దుల బండి పై స్వామివారిని మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. భక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గం వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు. ఏలినో ద్వారా వర్షాలు సమృద్ధిగా ఈ ఏడాది కురవలేదని ఇకనైనా ఆ భగవంతుడు కనికరించి వర్షాలు బాగా కురిసేలా దీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలియజేశారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






