ఆంగ్లంలో శ్రీమద్భగవద్గీత
- ఆడియో ఆల్బమ్ రూపొందించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్
- విడుదల చేసిన మారిషస్ రాష్ట్రపతి ధరమ్బీర్ గోకుల్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు(World-renowned Ghazal singer) డాక్టర్ గజల్ శ్రీనివాస్ రూపొందించిన శ్రీ మద్భగవద్గీత(Srimad Bhagavad Gita) ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌ను(English audio album) మారిషస్ రాష్ట్రపతి ధరమ్బీర్ గోకుల్(Mauritius President Dharambir Gokool) దంపతులు మారిషస్‌లోని హరిహర దేవస్థానం కళాజ్యోతి ప్రాంగణంలో విడదుల చేశారు. ఈ ఆడియో ఆల్బమ్‌లో శ్రీమద్భగవద్గీతలో ని 700 శ్లోకాలను గజల్ శ్రీనివాస్ స్వరపరచి గానం చేశారు. కోల్కతాలోని(Kolkata) అద్వైత ఆశ్రమానికి చెందిన స్వామి స్వరూపానంద అందించిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా తీసుకోగా, గీతా తాత్పర్యాలకు ఎన్. పార్థసారథి ఆంగ్లంలో స్వరాన్ని అందించారు.
మారి షస్ రాష్ట్రపతి ధరమ్బీర్ గోకుల్ మాట్లాడు తూ.. గజల్ శ్రీనివాస్ రూపొందించిన శ్రీమద్భగవద్గీత ఆంగ్ల ఆడియో ప్రపంచవ్యాప్తం గా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అదేవిధంగా, శ్రీమద్భగవద్గీత ను ప్రపంచంలోని 100 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన పవిత్రమైన గ్లోబల్ గీతా ఉద్యమాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమాన్ని బృందావన పార్థసారథి సమన్వయం చేసి నిర్వహించారు. కార్యక్రమంలో అజయ్ గున్నెస్ రోడ్లు భవనాల శాఖ మంత్రి, జ్యోతి జీతన్, ఆర్థిక శాఖా మంత్రి, సురేష్ సీబాలక్ దేశ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.