స్టార్‌షిప్ సూపర్ సక్సెస్

29-09-2026 | 05:35am
  1. నింగిలోకి దూసుకెళ్లిన ఎలాన్ మస్క్ కలల రాకెట్
  2. తొలిసారిగా భూకక్ష్యలోకి

న్యూయార్క్, సెప్టెంబర్ 28: స్పేస్‌ఎక్స్ సంస్థకు(SpaceX) చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, భారీ రాకెట్ ‘స్టార్షిప్(Starship)’2026ను సోమవారం తొలిసారిగా భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించి చరిత్ర సృష్టించింది. టెక్సాస్‌లోని బోకా చికాలో ఉన్న స్పేస్‌ఎక్స్ ‘స్టార్‌బేస్’ లాంచ్ సైట్ నుంచి ఫ్లైట్ 14 ప్ర యోగంలో భాగంగా ఈ మైలురాయి నమోదైంది. నాసా, ఆర్టెమిస్ చంద్ర కార్యక్రమానికి తన సంసిద్ధతను నిరూపించుకోవడానికి, భూమి చుట్టూ ఆరు పూర్తి ప్రదక్షిణలు చేసే లక్ష్యంతో, స్పేస్‌ఎక్స్ దీన్ని ప్రయోగించింది.

అతేకాదు సరికొత్త, అత్యంత అధునాతనమైన 26 స్టార్లింక్ ఉపగ్రహాలను(Starlink satellites) ఇది మో సుకెళ్లింది. అంతకుముందు జరిగిన 13 ప్ర యోగాలు సబ్-ఆర్బిటల్ (భూకక్ష్యకు దిగువన) మార్గంలో సాగగా, ఈ 14వ పరీక్షలో స్టార్‌షిప్ ఎగువ భాగం (షిప్ 41) మొదటిసారిగా భూమి చుట్టూ ఉన్న స్థిరమైన కక్ష్యకు చేరుకుంది. అయితే రాకెట్ నింగిలోకి దూ సుకెళ్తున్న సమయంలో ఎగువ దశలోని ఆ రు ఇంజిన్లలో ఒకటి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒక దశలో కక్ష్య ప్రయత్నాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఫ్లైట్ కంట్రోలర్లు చాకచక్యంగా వ్యవహరించి మిషన్‌ను ముందుకు తీసుకెళ్లారు.

చివరకు సింగిల్ రాప్టర్ ఇంజిన్‌ను మండించి రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. కక్ష్యలోకి చేరిన తర్వాత స్టార్‌షిప్ తన మొద టి వాణిజ్య ఆదాయ మిషన్‌ను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగా మునుపటి త రం కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి న 26 అత్యాధునిక మూడో తరం (వీ3) స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను అంతరిక్షంలో కి ప్రవేశపెట్టింది.

ఈ మిషన్ నిజానికి భూమి చుట్టూ 6 ప్రదక్షిణలు చేసి, దాదాపు 10 గంటల తర్వాత చిలీ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో పడాల్సిఉంది. అయితే, ఇంజిన్ సమస్య కారణంగా మిషన్‌ను ముందుగానే అంటే మూడుగంటల్లోనే ముగించి,  తక్కువ కక్ష్యల తర్వాతే పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా స్ల్పాష్‌డౌన్ చేశారు. 

మరిన్ని వార్తలు