19 August, 2026 | 1:01 AM

చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

19-08-2026 12:00 AM

మెటాకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

న్యూఢిల్లీ, ఆగస్టు 18: బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిపై భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, వారికి చట్టపరమైన రక్షణ లభించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటాకు మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. ఇన్స్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఫ్లాట్ ఫామ్‌లపై చిన్నారులపై లైంగిక వేధింపుల విషయంలో సంస్థ భారతీయ చట్టాలను పాటించాల్సిందేనని లేకుంటే హెచ్చరించింది.

దేశంలో విభిన్న భాషలు, సాంస్కృత్రిక సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. హక్కులు, వాక్ స్వాతంత్య్రం ముఖ్యమే అయినా సామాజిక పరిస్థితులను బట్టి అవి మారుతుంటాయని తెలిపింది. ఏఐ కంటెంట్ విషయంలో జనరేట్ చేశారా? లేక మనుషులు రూపొందించిరా? వంటి వాటిపై లేబుల్ ఏర్పాటు చేయాలని సూచించింది.