తండాల్లో తాగునీటికి తండ్లాట!
- నెల రోజులుగా తాగునీటికి తప్పని అవస్థలు
- చెంతనే కృష్ణమ్మ.. అయినా తీరని చింత
- ట్యాంకర్ల ద్వారా సరఫరా
- అయినా నీరందక ఇబ్బందులు
పాలకీడు,సెప్టెంబర్ 28: తీవ్ర వర్షాభావ పరిస్థితుల(Severe drought conditions) కారణంగా కల్మెట్ తండాలో తాగునీటి(Drinking water) కోసం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎల్ నీవో ప్రభావంతో(Impact of El Nino) వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు(Groundwater) క్రమంగా తగ్గుతుండటం. చెరువులు వట్టిపోతుండటంతో వర్షాకాలంలోనే తాగునీటికి గోస తీయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలోనే తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాబోయే వేసవి కాలంలో తాగునీటి కోసం మరిన్ని ఇబ్బందులు తప్పవని గిరిజనులు వాపోతున్నారు.
చెంతనే కృష్ణమ్మ ఉన్నా..
చెంతనే కృష్ణానది ఉన్నా తాగునీరు లభించక తండావాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. జాన్ పహాడ్ దర్గా గ్రామపంచాయతీ పరిధిలోని జాన్ పహాడ్ దర్గా, కల్మెట్ తండాలో వర్షాకాలంలోనూ నీటిఎద్దడి ఏర్పడింది. ఎల్ నీవో ప్రభావంలో వర్షాలు లేక చెరువులు ఎండి, భూగర్భజలాలు అడుగంటున్నాయి. గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి నీరు సరిపడలేకపోవడంతో గిరిజనలు వ్యవసాయ బావులు, బోర్ల(Tribals are digging agricultural wells and boreholes.) నుంచి తెచ్చుకుంటున్నారు.
గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా వచ్చిన నీటిని బిందెల్లో పట్టుకొని ఇంటి అవసరాలకు వాడుకుంటున్నామని చెబుతున్నారు. వర్షాకాలంలో ఈవిధంగా నీటిఎద్దడి ఏర్పడంతో గిరిజ నులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం లోనే ఇలా ఉంటే వచ్చే వేసవికాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. *పట్టించుకోని అధికార యంత్రాంగం ! :* బావులలో, బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో నీటిఎద్దడి ఏర్పడినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడంలేదని, తాగునీటి ఎద్దడి నివారించాలని కోరుతున్నారు. మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటితో పాటు ఇంటి అవ సరాలకు నీటిని తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. అనేకతండాలు, గ్రామాల్లో పంచాయతీ బోర్లు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో నీటి ఎద్దడి ఏర్పడుతుంది.
పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం..
కృష్ణ నది ఒడ్డున బోర్ వేయడం జరిగింది అక్కడి నుండి పైప్ లైన్ వేయడం కోసం పది లక్షల వరకు ఖర్చు అవుతుంది బడ్జెట్ కోసం ఉన్నత అధికారులకు నివేదిక పంపించినం త్వరలో నీటి సమస్య పరిష్కరిస్తాం.
లక్ష్మి , ఎంపీడీవో
నెల రోజులుగా అల్లాడుతున్నాం..
నెల రోజుల నుంచి తాగునీళ్లు సరిగా రాక అల్లాడుతున్నాం. ముసలోళ్లం ఎక్కడపోయి తెచ్చుకోవాలి. మంచి నీళ్లు వస్తేనన్నా ఎట్టన్నా బతుకుతాం.. అసలు నీళ్లు రాకపోతే ఏడుపోయి తెచ్చుకొని బతకాలి. పైనున్న అధికా రులు ఎట్లైనా రోజూ మంచినీళ్లు వచ్చేట్లు చూడాలి.
లింగమ్మ, కల్మెట్ తండా,
తాగునీటి అవసరాలు తీర్చాలి
వర్షాలు పడత లేవు మిషన్ భగీ రథ నీటి సరఫరా పెంచి తాగునీటి అవ సరాలు తీర్చాలి. కృష్ణ నది నుండి పైప్ లైన్ వేసి శాశ్వత పరిష్కారం చూపాలి.ట్యాంకర్ల ద్వారా ఎక్కువ నీటిని అందిస్తే అవసరాలకు ఉపయోగపడతాయి. ప్రజాప్రతినిధు లు, అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి.
రాజు, కల్మెట్ తండా