కుంగ్‌ఫూ, కరాటే రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌లో విద్యార్థులు

21-09-2026 | 12:08pm

విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, తో పాటు సర్టిఫికెట్స్ అందజేత

కొడిమ్యాల, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన విన్నర్స్ ఇంగ్లీష్ స్కూల్(Winners English School) విద్యార్థులు సోమగూడెం, బెల్లంపల్లిలో నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ 6వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే ఛాంపియన్‌షిప్‌లో  ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో పాఠశాల కు చెందిన 3వ,4వ తరగతి విద్యార్థులు ఎన్.సాన్వి, ఎం.సన్నిహిత, బి.భవ్యశ్రీ, ఎం.మోక్షిత్, ఏ.నిహాస్విక,  ఎం.శ్రీకార్ణి తమ ప్రతిభను ప్రదర్శించి కుంగ్‌ఫూ, కరాటేలో పోటీపడ్డారు. విద్యార్థులకు రాజు మాస్టర్  ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ తో పాటు  సర్టిఫికెట్స్ అందించారు. 

విద్యార్థుల పాల్గొనడంపై  స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణ, స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించడంలో పిల్లల యొక్క తల్లితండ్రుల ప్రోత్సహం ఎంతో అవసరమని తెలిపారు.

మరిన్ని వార్తలు