calender_icon.png 31 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఆరోగ్య పాఠశాలల కార్యక్రమంపై దృష్టి సారించాలి..

30-08-2025 06:47:08 PM

విద్యార్థులకు కలెక్టర్ రాజర్షిషా సందేశం..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆరోగ్యపరమైన అలవాట్లు చిన్న వయసులోనే అలవర్చుకోవడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. బోరజ్ మండలంలోని గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో విద్యార్థులకు 6 ఆరోగ్య పాఠశాల అంశాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శుభ్రత, పౌష్టికాహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

మానసిక, శారీరక ఆరోగ్యం మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ మానసిక వికాసానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యపరంగానే కాదు, వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం కూడా విద్యార్థుల అభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలో అభ్యాసించే ప్రతి విషయం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశంగా మారాలన్నారు. సానుకూల ఆలోచన, ఆత్మవిశ్వాసం, సామూహిక వ్యవహార శైలి వంటి అంశాలు మానసిక వికాసానికి మార్గం వేస్తాయని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని ఛాబ్రా, తహసిల్దార్ రాథోస్ రాజేశ్వరీ ప్రధానోపాధ్యాయులు పద్మజ, రిసోర్స్ పర్సన్ అజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.